జగన్ పై నోరు జారిన వైసీపీ ఎంపీ

0
18
Ysrcp mp raghu rama krishnam raju sensational comments on jagan mohan reddy

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై నోరు జారాడు పార్టీ  పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడటంతో ఒక వర్గం వాళ్లతో సమావేశమై మాట్లాడుతున్న సమయంలో జగన్ నాయకత్వం వర్ధిల్లాలి …… జై జగన్ …… జై జై జగన్ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు ఇస్తూ రఘురామకృష్ణంరాజు ప్రసంగానికి అడ్డు తగలడంతో ఆవేశానికి లోనైన సదరు ఎంపీ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకఎవడి నాయకత్వం బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలయ్యా …… నోర్ముసుకోఅంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు.

అయితే ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కార్యకర్తలు అత్యుత్సాహంతో జై జగన్ అన్నారు కానీ మరో నాయకుడ్ని కాదు దాంతో రఘురామకృష్ణంరాజు కు ఇది మెడకు చుట్టుకోవడం ఖాయం. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వీడియోని మరింతగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఖచ్చితంగా సంఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి