పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో

0
25
rajtharuncomments on wedding

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. నా ఫ్రెండ్ హీరో నిఖిల్ సిద్దార్థ్  ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతడి కాపురం ఎలా సాగుతోందో రెండు సంవత్సరాల పాటు చూసాక అపుడు నా పెళ్లి పై తుది నిర్ణయం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాజ్ తరుణ్. హీరో నిఖిల్ – రాజ్ తరుణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే నిఖిల్ సిద్దార్థ్ ఇటీవలే పల్లవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో కేవలం 50 మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

నిఖిల్ పెళ్లి కూడా అయ్యింది కదా ! మరి నీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే అదిగో ఇదే సమాధానం ఇచ్చాడు రాజ్ తరుణ్. నా ఫ్రెండ్ నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రెండేళ్ల కాపురం తర్వాత కూడా బాగానే ఉంటే అప్పుడు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను అంటూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రాజ్ తరుణ్. పెళ్లి చేసుకోవాలని రాజ్ తరుణ్ కు ఉంది కానీ ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లు పెటాకులు అవుతుండటంతో ఇలా వ్యాఖ్యానించి ఉంటాడు.

తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ఒరేయ్ ……. బుజ్జిగా . ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ కరోనా వల్ల ఇప్పట్లో థియేటర్ లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు అలాగే థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వెంటనే వస్తారన్న నమ్మకం కూడా లేదు అందుకే ఓటిటిలో విడుదల చేస్తున్నారు ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని. అక్టోబర్ 2 న రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ …… బుజ్జిగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి