యాత్ర డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ మూవీ

0
57

మహి వి రాఘవ్ యాత్ర సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర మంచి విజయాన్ని సాధించింది. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హాట్ భామ అనసూయ కూడా కీలక పాత్రలో నటించింది. కట్ చేస్తే మహి వి రాఘవ్ తాజాగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మరో కథ రాసుకున్నాడట. ఆ కథ అల్లు అర్జున్ కు బాగుంటుందని భావిస్తున్నాడట.

అందుకే అల్లు అర్జున్ కు ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అల్లు అర్జున్ పచ్చ జెండా మాత్రం ఊపలేదు. పక్క స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా చేద్దాం అని మాత్రం హామీ ఇచ్చాడని తెలుస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం. యాత్ర చిత్రాన్ని బాగానే తెరకెక్కించాడు కాబట్టి మహి వి రాఘవ కు తప్పకుండా ఛాన్స్ రావచ్చు అని అంటున్నారు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి మరి.

మునుపటి వ్యాసంరజనీకాంత్, విజయ్ లపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్
తదుపరి ఆర్టికల్కేసీఆర్ సర్కారు పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి