ఘనంగా వై ఎస్సార్ జయంతి వేడుకలు

0
43

వై ఎస్సార్ జయంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రమే ఇడుపులపాయలో చేరుకున్నారు కుటుంబ సమేతంగా. జులై 8 , 1949 న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. 1971 లో విజయమ్మ ని పెళ్లి చేసుకున్నారు. 2004 లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలనలో చెరగని ముద్ర వేశారు వై ఎస్సార్. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టింది ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే. పాలనలో తనదైన ముద్ర వేసిన వై ఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మొదటి దఫా ముఖ్యమంత్రి గా దిగ్విజయంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో దఫా కూడా ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ , చిరంజీవి , బాలకృష్ణ, ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ రెండోసారి కూడా సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు వై ఎస్సార్.

రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు నెలల పదవీ కాలం పూర్తి కాకుండానే 2009 సెప్టెంబర్ 2 న పావురాల గుట్ట దగ్గర చనిపోయారు. ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మహానేత పావురాల గుట్టలో కనుమరుగయ్యాడు. మహానేత మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయి. వాళ్ళ కోసం యాత్ర చేపట్టిన జగన్ ని కాంగ్రెస్ అధిష్టానం ఆపడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు జగన్. కాంగ్రెస్ తరుపున వచ్చిన పదవికి రాజీనామా చేసి మళ్లీ పార్లమెంట్ కు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక గత ఎన్నికల సమయంలో అవిరాల కృషి తో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు జగన్. తండ్రి ఆశయాల కోసం శ్రమిస్తున్న జగన్ ఈరోజు వై ఎస్సార్ 71 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి