ఆ ప్రశ్న అనుష్కని అడగలేదా ?

0
67
anushka shetty

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇటీవల నిశ్శబ్దం చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ ప్రశ్న అడిగాడు ? దాంతో నెటిజన్లను అడిగే బదులు హీరోయిన్ అనుష్కని అడిగితే సరిపోయేది కదా ! అని అంటున్నారు కొంతమంది. ఇంతకీ కోన వెంకట్ నెటిజన్లను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా …….. థియేటర్లు ఓపెన్ కావాలంటే మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది కాబట్టి నిశ్శబ్దం చిత్రాన్ని థియేటర్ లో చూస్తారా ? లేక ఓటిటి లో చూస్తారా ? అంటూ ప్రశ్నించడమే. అయితే ఇలాంటి ప్రశ్న అనుష్కని అడిగితే సరైన సమాధానం ఇచ్చి ఉండేది కదా ! అని అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు.

సాలిడ్ అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో కోన వెంకట్ తన మిత్రులతో కలిసి నిర్మించిన చిత్రం నిశ్శబ్దం. తమిళ నటుడు మాధవన్ , అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే , సుబ్బరాజు , మైఖేల్ మ్యాడ్ సన్ , శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన నిశ్శబ్దం చిత్రాన్ని ఏప్రిల్ లో 5 భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా వల్ల థియేటర్ లు మూతబడ్డాయి. దాంతో ఓటిటిలో విడుదల చేయబోతున్నారు అంటూ పుకార్లు షికారు చేసాయి కానీ కోన అండ్ కో ఖండించారు. కట్ చేస్తే ఇప్పట్లో థియేటర్ లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. అలాగే ఓపెన్ అయినా ఇప్పట్లో జనాలు థియేటర్ కు వచ్చేలా కనిపించడం లేదు దాంతో నెటిజన్లని సలహా అడుగుతున్నాడు కోన. అనుష్క నటించిన చిత్రం కాబట్టి ఎక్కడ విడుదల చేసినా మంచి డిమాండ్ ఉంటుంది అలాగే ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయి. ఇక సినిమా బాగుంటే బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం. 

మునుపటి వ్యాసంఆంటీ అని పిలుస్తుంటే అనసూయకు ఒళ్ళు మండుతోందట
తదుపరి ఆర్టికల్కార్లను అమ్ముకున్న రేణు దేశాయ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి