హీరో విశాల్ ను మోసం చేసిన మహిళ సంచలన ఆరోపణలు

0
17
Woman sensational allegations of cheating hero Vishal

హీరో విశాల్ ఆఫీసులో పనిచేసే రమ్య ఏకంగా 45 లక్షలను మోసం చేసిందట. దాంతో ఆమెపై చెన్నై లోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు విశాల్ మేనేజర్. అయితే విశాల్ ఆఫీసులో పనిచేసే రమ్య మాత్రం ఓ ఛానల్ లో ప్రత్యక్షమై విశాల్ పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వానికి టీడీఎస్ కట్టకుండా మోసం చేయడమే కాకుండా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని , ఇలాగే చేస్తే విశాల్ రహస్యాలను అన్నింటినీ బయట పెడతానని అంటోంది. నాకు పోలీసులు రక్షణ కల్పించాలని  , ఎందుకంటే విశాల్ వ్యవహారాలు చూసే హరి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించారని రక్షణ కల్పిస్తే విశాల్ రహస్యాలను బయటపెడతానని సంచలనం సృష్టిస్తోంది.

45 లక్షలు మోసం చేసిన రమ్య పై కేసు పెట్టారు విశాల్. కానీ ఆ సొమ్ము నేను తీసుకోలేదు. నాపై కుట్ర పన్ని ఇలా చేస్తున్నారు అని రమ్య అంటోంది. మొత్తానికి ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళింది కాబట్టి విచారణ చేపట్టడం ఖాయం. అయితే విశాల్ పై తమిళనాట అక్కడి ప్రభుత్వం మాత్రమే కాదు కొంతమంది సినీ ప్రముఖులు కూడా కోపంగా ఉన్నారు. దాంతో రమ్య చేస్తున్న ఆరోపణలతో వాళ్ళు రంగంలోకి దిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విశాల్ తాజాగా చక్ర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా సైబర్ నేరాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడం విశేషం.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి