అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలనుందా ?

0
39
wil aidmk split in tamilnadu?

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నైతమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి దాంతో ఆ పార్టీ రెండుగా చీలనుందా ? అన్న అనుమానం నెలకొంది. అమ్మ జయలలిత మరణించిన తర్వాత తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అసలు జయలలిత బ్రతికి ఉన్నప్పుడు పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. అయితే జయలలిత చనిపోయిన తర్వాత శశికళ ముఖ్యమంత్రి కావాలనుకుంది.

అన్నీ సెట్ చేసుకున్నాక అవినీతి ఆరోపణల మీద శశికళ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో తనకు నమ్మినబంటు అని భావించిన శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఆ తర్వాత పన్నీర్ సెల్వం – పళనిస్వామి ఏకమై శశికళ ని అన్నాడీఎంకే పార్టీ నుండి సస్పెండ్ చేసారు. అయితే ఇన్నాళ్లు బాగానే ఉంది కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎందుకంటే వచ్చే ఏడాది 2021 ఆఖరులో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి దాంతో పన్నీర్ సెల్వం – పళనిస్వామి ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి నేనంటే నేనని నిన్న జరిగిన పార్టీ సమావేశంలో వివాదానికి దిగారు. పార్టీ సమావేశం మొత్తం రసాభాసగా సాగడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదాపడింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్దాం అని పన్నీర్ తో పాటు పళనిస్వామి అంటున్నాడు. ఈ ఆధిపత్య పోరు చూస్తుంటే పిల్లి పోరు పిల్లిపోరు పిట్ట తీర్చనంట అన్నట్లుగా ఎవరో సీఎం కుర్చీని తన్నుకుపోవడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మునుపటి వ్యాసంజగన్ కు షాక్ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్
తదుపరి ఆర్టికల్ఆ హీరోతో విబేధాల గురించి నోరు విప్పిన డైరెక్టర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి