ఆ బయోపిక్ లో ఆ హీరోయిన్ సెట్ అవ్వదా ?

0
68
pv sindhu biopic

ఆ బయోపిక్ లో ఆ హీరోయిన్ సెట్ అవ్వదా ?

తెలుగమ్మాయి పీవీ సింధు బయోపిక్ చేయాలని భావిస్తున్నాడు నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో యావత్ భారతానికి హీరోగా కనిపించిన వ్యక్తి సోనూ సూద్. వలస కూలీలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే కొంతమందిని తన స్వంత ఖర్చులతో వాళ్ళ గ్రామాలకు పంపించిన మానవతావాది సోనూ సూద్. దాంతో ఒక్కసారిగా సోనూ కు సూపర్ హీరో ఇమేజ్ వచ్చింది. తెరపై విలన్ గా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న సోనూ సూద్ నిర్మాతగా కూడా మారుతున్నారు పీవీ సింధు బయోపిక్ తో.

అయితే ఈ బయోపిక్ లో మొదట సమంత హీరోయిన్ అని అనుకున్నారట. కానీ సమంత కంటే దీపికా పదుకునే అయితేనే దేశ వ్యాప్తంగా ఈ బయోపిక్ కి కావాల్సినంత క్రేజ్ వస్తుందని ఆమెని సంప్రదించాడట సోనూ అయితే దీపికా డేట్స్ ఖాళీ లేవు దాంతో ఆమె కోసం కొంతకాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. పీవీ సింధు బయోపిక్ లో దీపికా పదుకునే అయితేనే మార్కెట్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడట సోనూ సూద్. అందుకే దీపికా పదుకునే కోసం వెయిట్ చేస్తానని అంటున్నాడట.

సమంతకు కూడా ఎనలేని క్రేజ్ ఉంది , హీరో అంతటి ఇమేజ్ ఉంది కాని సమంత కు కేవలం తెలుగు , తమిళ భాషల్లో మాత్రమే మార్కెట్ ఉంది అందుకే సమంత కంటే దీపికా పదుకునే బెటర్ అని భావిస్తున్నారట. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల చేత దేవుడి గా పూజలందుకుంటున్న సోనూ సూద్ త్వరలో జరగబోయే నీట్ , జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. సకాలంలో పరీక్షా సెంటర్ దగ్గరకు వెళ్లలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అలాంటి వాళ్ళను సకాలంలో సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తానని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు సోనూ సూద్.

మునుపటి వ్యాసంవిజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్
తదుపరి ఆర్టికల్టాలీవుడ్  సింగర్ తల్లి మృతి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి