ప్రభాస్ పెద్దనాన్న కోరిక తీరుస్తాడా ?

0
45
prabhs
ప్రభాస్ పెద్దనాన్న కోరిక తీరుస్తాడా ?

బ్లవర్లీ హిల్స్ లో ప్రభాస్ తో కలిసి భోజనం చేయాలనేది కృష్ణంరాజు కోరిక. తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాడు కృష్ణంరాజు అయితే అతడి కోరిక తీరుతుందా ? ప్రభాస్ పెద్దనాన్న కోరిక తీరుస్తాడా ? అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. బ్లవర్లీ హిల్స్ లో కూర్చొని భోజనం చేయడం ఓ లెక్కా దాన్ని తీర్చాలా అని అనుకుంటున్నారా ? తేలిగ్గా తీసుకుంటున్నారా ? బ్లవర్లీ హిల్స్ లో భవంతి కొనాలన్నా , అక్కడ ఉండాలన్నా కేవలం హాలీవుడ్ స్టార్ లకు మాత్రమే సాధ్యం ఎందుకంటే అక్కడ వాళ్లకు మాత్రమే ఎంట్రీ మరి. మన ప్రభాస్ నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కానీ బాహుబలి తర్వాత ఇండియన్ స్టార్ అయ్యాడు.

ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగితేనే హాలీవుడ్ లో సక్సెస్ అయితేనే ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు అప్పుడు బ్లవర్లీ హిల్స్ లో ఇల్లు కొంటాడు అప్పుడు కానీ కృష్ణంరాజు కోరిక నెరవేరదు. అయితే కృష్ణంరాజు కోరిక నెరవేరేలా ఇటీవలే ఆది పురుష్ అనే సినిమా అంగీకరించాడు ప్రభాస్. ఈ సినిమా మొదట 500 కోట్ల బడ్జెట్ అని అనుకున్నారు కానీ తాజాగా కృష్ణంరాజు వెల్లడించిన దాని ప్రకారం ఆది పురుష్ సినిమా బడ్జెట్ 1000 కోట్లంట.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగింది కాబట్టి ఈ మాత్రం బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ఈ ఆది పురుష్ చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారట. దానికి సంబందించిన అని పనులు చేస్తున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా కృష్ణంరాజు వెల్లడించడం విశేషం. ప్రభాస్ ని చూసి చాలా గర్వంగా ఉందని , తప్పకుండా బ్లవర్లీ హిల్స్ లో ఇల్లు కొంటాడని , అక్కడ మేమిద్దరం కలిసి భోజనం చేస్తామని నమ్ముతున్నాడు కృష్ణంరాజు. ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకు అన్న సంగతి తెలిసిందే. 

మునుపటి వ్యాసంతెలుగు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వీళ్ళే నట
తదుపరి ఆర్టికల్మహేష్ ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటాడో తెలుసా?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి