కంగనా రనౌత్ ముంబై రాజకీయాల్లోకి రానుందా ?

0
23
kangana will join politics

టాలీవుడ్ మూవీ న్యూస్, ముంబయి- బాలీవుడ్ వివాదాస్పద భామ కంగనా రనౌత్ ముంబై రాజకీయాల్లోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతకొంత కాలంగా ముంబైలో జరుగుతున్న రాజకీయాల పట్ల నిశితంగా గమనిస్తున్న విశ్లేషకులు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు శివసేన – భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా మిత్రపక్షాలు. పైగా ఇద్దరి అజెండా కాషాయం కాబట్టి ఎన్ని లుకలుకలు ఉన్నా మూడు దశాబ్దాలుగా కలిసే ఉంటున్నారు కానీ ఇన్నాళ్ల తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరి మధ్య పేచీ వచ్చింది.

ఎన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగించాలి మేము కూడా అధికారాన్ని అనుభవించాలి కదా ! అని ఆలోచన వచ్చిందే తడవుగా రాజకీయ పావులు కదిపారు దానికి తోడు కాంగ్రెస్ , ఎన్సీపీ లు శివసేనకు అండగా నిలిచాయి దాంతో భారతీయ జనతా పార్టీని ఫడ్నవీస్ ని కాదని శివసేన అధికార పీఠం పై కూర్చుంది. ఇక అప్పటి నుండి బీజేపీ – శివసేన ల మధ్య ఉప్పు నిప్పు లా తయారయ్యింది పరిస్థితి. ఇక ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా గతకొంత కాలంగా కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత మంటను రగిలించాయి.

ఇప్పటికిప్పుడు కాదు కానీ భవిష్యత్తులో తప్పకుండా కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని , అందునా ముంబై వేదికగా రాజకీయాలను కంగనా ప్రారంభించడం ఖాయమని తెలుస్తోంది. తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఉద్దవ్ ఠాక్రే పై తీవ్ర ఆగ్రహంతో ఉంది కంగనా. ఇక నిన్న సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ని కలిసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. కమలనాధులు కూడా కంగనాకు అండగా నిలుస్తున్నారు గతకొంత కాలంగా. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తప్పకుండా భవిష్యత్తులో కంగనా ముంబై రాజకీయాల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఫైర్ బ్రాండ్ గా పేరున్న కంగనా బీజేపీ లో చేరినా అందులో ఇమడగలదా ? లేక సొంత పార్టీ పెడుతుందా ? చూడాలి. 

మునుపటి వ్యాసంబొబ్బిలి రాజా సంచలనానికి 30 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి రానున్నాడా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి