హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి రానున్నాడా ?

0
13
vishal entering into politics

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నై-తమిళనాట ఫైర్ బ్రాండ్ గా ఉన్న హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విశాల్. ఈ హీరో అసలు తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ప్రాంతానికి చెందిన వాడు. విశాల్ తండ్రి చెన్నై లో స్థిరపడటంతో విశాల్ బాల్యమంతా చెన్నైలోనే గడిచింది. దాంతో నేను తమిళుడినే అంటాడు విశాల్. ఇక ఆ విషయం పక్కన పెడితే తమిళనాట వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి దాంతో హీరో విశాల్ కూడా అసెంబ్లీ బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ తో సమావేశం కావడానికి సిద్ధం అవుతున్నాడట.

తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం లేదు కానీ ఇపుడున్న అన్నా డీఎంకే , డీఎంకే పార్టీలు కాస్త బలహీనం అవుతున్నాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఈ రెండు పార్టీలు జయలలిత , కరుణానిధి లేకుండా పోటీ చేసిన దాఖలాలు లేవు కానీ తొలిసారిగా ఈ ఇద్దరూ లేకుండా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా బలహీనం అయినట్లే అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

సరిగ్గా ఇదే సమయంలో కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టాడు త్వరలోనే రజనీకాంత్ కూడా పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇళయ దళపతి విజయ్ కూడా రాజకీయాలపై దృష్టి పెట్టాడు అలాగే సూర్య ని తన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని పోస్టర్ లు వేస్తూ కోరుతున్నారు. దాంతో విశాల్ కూడా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నాడట. ఆమధ్య ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక జరిగితే ఆ స్థానం నుండి పోటీ చేయడానికి నామినేషన్ వేసాడు విశాల్. కానీ తెరవెనుక పెద్ద రాజకీయ డ్రామా సాగడంతో విశాల్ నామినేషన్ ని రద్దు చేసారు. దాంతో మరింత కసిగా ఉన్నాడు విశాల్. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నాడట. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హీరోల రసవత్తర పోరు సాగనుందన్న మాట. 

మునుపటి వ్యాసంకంగనా రనౌత్ ముంబై రాజకీయాల్లోకి రానుందా ?
తదుపరి ఆర్టికల్ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల చిత్ర కథ నేపథ్యం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి