బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?

0
40
bogboss 4 elimination

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్బిగ్ బాస్ 4 గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించడం లేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ వల్ల మంచి రేటింగ్ వస్తోంది కానీ బిగ్ బాస్ వల్ల అయితే కాదు. అయితే బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఇక ముందు మరింతగా రేటింగ్ పెరుగుతుందేమో చూడాలి. గంగవ్వ కు ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల కాస్త ఫరవాలేదనిపిస్తోంది షో. గంగవ్వ కు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆమెని ఎలిమినేట్ చేస్తారేమోనని భావించారు అంతా కానీ గంగవ్వ వెళ్ళిపోతే బిగ్ బాస్ షో మరింత నీరుగారి పోయే ప్రమాదం ఉంది అందుకే ఆమెకు మెరుగైన వైద్యం అందించారు బిగ్ బాస్ దాంతో రెండో వారంలో ఎలిమినేట్ అయ్యే వాళ్లలో గంగవ్వ లేనట్లే !

ఇక ఈ వారం అంటే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం తేలనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రేపు ఎలిమినేట్ అయ్యే వాళ్లలో ముందు వరుసలో ముగ్గురు ఉన్నారు వాళ్లలో అమ్మ రాజశేఖర్ , వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గత వారమే బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన సాయి కుమార్ అలాగే కరాటే కళ్యాణి ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన సాయి అంతగా ఆకట్టుకోవడం లేదు దాంతో అతడు ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

లేదంటే కరాటే కళ్యాణి ఎలిమినేట్ కావడం ఖాయం. కరాటే కళ్యాణి కూడా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. అమ్మ రాజశేఖర్ కూడా మంచి ఎంటర్ టైనర్ గా నిలిచాడు కానీ ఎలిమినేట్ అయ్యే లిస్ట్ లో ఈ ముగ్గురూ ఉన్నారు కాబట్టి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయితే షో మరింత నీరసంగా ఉంటుంది కాబట్టి కరాటే కళ్యాణి లేదంటే సాయి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గంగవ్వ మాత్రం ఇంకా కొన్ని వారాలు ఇంట్లోనే ఉండటం ఖాయం. 

మునుపటి వ్యాసంమెగా మేనల్లుడు సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే
తదుపరి ఆర్టికల్తాప్సీ స్థానంలో అనుష్క
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి