ఆ సినిమాలో మహేష్ – విజయ్ లలో నటించేది ఎవరు ?

0
55
gentleman 2

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్1993 లో విడుదలై ప్రభంజనం సృష్టించిన చిత్రం జెంటిల్ మెన్. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఈ చిత్రంతో అర్జున్ మళ్ళీ తన సత్తా చాటడమే కాకుండా తిరుగులేని స్టార్ హీరో అయ్యాడు తెలుగు , తమిళనాట. శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించాడు. జెంటిల్ మెన్ చిత్రం అప్పట్లో విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే ఏ ఆర్ రెహ్మాన్ అందించిన పాటలు కూడా పాపులర్ అయ్యాయి. కట్ చేస్తే 27 సంవత్సరాల తర్వాత జెంటిల్ మెన్ 2 చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత కుంజుమోన్.


2021 లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి కూడా శంకర్ దర్శకత్వం వహించనున్నాడట. అయితే హీరోలు ఎవరు ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేదంటే ఇళయ దళపతి విజయ్ లలో ఎవరో ఒకరు హీరో అవ్వడం ఖాయమని వినిపిస్తోంది. మహేష్ బాబు తో శంకర్ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉండే. హిందీలో విజయం సాధించిన త్రీ ఇడియట్స్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు ముందుగా మహేష్ బాబు నే అనుకున్నాడు శంకర్ . మహేష్ కూడా ముందు ఓకే చెప్పాడు కానీ తీరా సమయానికి నో చెప్పడంతో విజయ్ తో ఆ సినిమా రీమేక్ చేసాడు. తెలుగులో అది అట్టర్ ప్లాప్ అవ్వగా తమిళంలో మాత్రం విజయ్ కున్న క్రేజ్ తో మంచి హిట్ అయ్యింది.

కట్ చేస్తే ఇపుడు జెంటిల్ మెన్ 2 చిత్రం కోసం మళ్ళీ మహేష్ బాబుని సంప్రదించారట శంకర్. అయితే శంకర్ కు గతకొంత కాలంగా సాలిడ్ హిట్ లేదు దాంతో కాబోలు లేకపోతే సీక్వెల్ కదా ! అనే అనుమానంతో కావచ్చు ఇంకా మహేష్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకవేళ మహేష్ రిజెక్ట్ చేస్తే విజయ్ తో చేయడానికి సిద్ధం కావాలని డిసైడ్ అయ్యాడట శంకర్. ఇక ఈ సీక్వెల్ లో కూడా అర్జున్ నటించనున్నాడు కాకపోతే కీలక పాత్ర అని తెలుస్తోంది అసలు హీరో మహేష్ లేకపోతే విజయ్ అని తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి