1992 డిసెంబర్ 6 న అసలు ఏం జరిగిందంటే

0
38
cbi clean chit to advani and others

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటన భారత రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. లక్షలాది కరసేవకులు బాబ్రీ మసీద్ కూల్చివేతకు దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వస్తున్నారన్న సమాచారంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కరసేవకులను ఎట్టి పరిస్థితుల్లో మసీదు దరిదాపుల్లోకి రాకుండా చూడాలని పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్ స్ట బ్యులరీ , 195 కంపెనీల పారామిలిటరీ బలగాలు , నాలుగు కంపెనీల సీఆర్ పీఎఫ్ బలగాలు , 15 కంపెనీల బాష్పవాయువు స్క్వాడ్స్ , 15 మంది ఇన్స్పెక్టర్లు , 30 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు , 2,300 మంది కానిస్టేబుళ్లని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసాయి.

అయితే ఇంతపెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ కరసేవకులు వీళ్లందరినీ దాటుకొని మసీదు ప్రాంతానికి చేరుకొని తమకు దొరికిన వాటితో మసీదుని నేలకూల్చడం మొదలు పెట్టారు. మొదట ఓ కరసేవకుడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మసీద్ పైకి ఎక్కాడు అతడి వెనకాలే కొద్దిసేపట్లోనే వందలాది కరసేవకులు మసీదుని చేరుకున్నారు. పైకి ఎక్కి మసీదుని నేలమట్టం చేయడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం ఈ పని ప్రారంభిస్తే సాయంత్రం 5: 30 నిమిషాలకు పూర్తి చేశారు. దాంతో అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే మసీదు ని కూల్చే ముందు ఆ పరిసర ప్రాంతానికి బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ , మురళీమనోహర్ జోషి , ఉమాభారతి , వినయ్ కతియార్ తదితరులు వచ్చారు. మసీదు ని కూల్చేందుకు వెళ్తున్న కరసేవకులను ఆపడానికి ప్రయత్నించారు కానీ వీళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. 1992 డిసెంబర్ 6 న జరిగిన ఈ సంఘటన జరుగగా అప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. అయోధ్యలో మసీదుని కూల్చివేసిన అనంతరం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసారు పీవీ. ఇన్నేళ్ల తర్వాత నిన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అద్వానీ తో సహా అప్పటి నాయకులందరూ నిర్దోషులే అని సంచలన తీర్పు ఇచ్చింది. దాంతో 92 ఏళ్ల వయసులో ఉన్న అద్వానీ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి