చంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల ఫ్రెండ్ షిప్ పై వెబ్ సిరీస్

0
49
cbn, ys r

 

కరోనా పుణ్యమా అని వెబ్ సిరీస్ ల జోరు మాములుగా లేదు. రకరకాల కథాంషాలతో వెబ్ సిరీస్ లకు శ్రీకారం చుడుతున్నారు. ఆ కోవలో తాజాగా చంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహం పై అలాగే వాళ్ళ మధ్య వచ్చిన వైరం పై వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. రకరకాల వెబ్ సిరీస్ ల మధ్య చంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల వెబ్ సిరీస్ తప్పకుండా విభిన్నమైన అంశం అనే చెప్పాలి. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే అంశం అవుతుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. చంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు ఇద్దరు కూడా మంచి మిత్రులు. ఇద్దరు కూడా ఒకేసారి రాజకీయాలలోకి వచ్చారు అలాగే శాసనసభలో ఒకేసారి అడుగుపెట్టారు. అంతేనా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావడం గమనార్హం.

రాజకీయాలలోకి వచ్చిన తొలినాళ్ళలో ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడో అప్పుడు చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యింది. పైగా తెలుగుదేశం ప్రభంజనం లో చంద్రబాబు ఓడిపోయాడు దాంతో కాంగ్రెస్ పార్టీని వీడి పిల్ల నిచ్చిన మామ కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్టీఆర్ ని దింపేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి గా కూడా పనిచేశాడు. ఇక రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా ఎదిగాడు. 2004 కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టాడు. మళ్లీ 2009 లో కూడా అధికారాన్ని అందిపుచ్చుకున్నాడు వై ఎస్. 2009 ఎన్నికల్లో వై ఎస్ కి వ్యతిరేకంగా చంద్రబాబు, చిరంజీవి, కేసీఆర్ తదితరులు పోటీలో ఉన్నా అధికారం మాత్రం రాజశేఖర్ రెడ్డినే వరించింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఘోర ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు కానీ ఆ తర్వాత ఇద్దరు కూడా రాజకీయ విరోధులు అయ్యారు. ఇలాంటి వెబ్ సిరీస్ తెలుగునాట వస్తే ప్రేక్షకులకు మంచిదేగా.

మునుపటి వ్యాసంతెరపైకి దాసరి బయోపిక్
తదుపరి ఆర్టికల్నగ్నంగా నటించడానికి రెడీ అంటున్న ప్రభాస్ భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి