కత్తి కార్తీకని బెదిరించారట

0
48
kathi karthika

 టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్బిగ్ బాస్ 3 లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైన కత్తి కార్తీక కు తీవ్ర హెచ్చరికలు చేశారట. అంతేకాదు ఆమె డ్రైవర్ పై కూడా దాడి చేసి ఈ విషయాన్ని చెప్పారట. తక్షణమే దుబ్బాక ఉప ఎన్నికల బరినుండి తప్పుకోవాలని హెచ్చరించారట . దాంతో అప్రమత్తమైన కత్తి కార్తీక రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కత్తి కార్తీక ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పారట.

ఇటీవల దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సోలిపేట మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. అయితే ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎందుకంటే కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది కాబట్టి. అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు కాబట్టి ఇప్పటి నుండే ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేసుకోవాలని భావించిన పలువురు రాజకీయ నాయకులు దుబ్బాకలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే కత్తి కార్తీక కూడా పోటీ చేయాలనే ఆసక్తితో జోరుగా ప్రచారం చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నన్ను గెలిపించండి తప్పకుండా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అంటూ ప్రజలను కలుస్తోంది. కత్తి కార్తీక వెంట యువత బాగానే తిరుగుతుండటంతో కాబోలు కొంతమందికి కంటగింపుగా మారింది దాంతో కత్తి కార్తీక డ్రైవర్ పై దాడి చేయడమే కాకుండా కార్తీక ని  పోటీ చేయొద్దని హెచ్చరించారట. ఇంకా ఉప ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఇంత దారుణంగా ఉంటే షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

మునుపటి వ్యాసంకరీంనగర్ లో బిక్షాటన చేసిన షకలక శంకర్
తదుపరి ఆర్టికల్డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గిఫ్ట్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి