పురందేశ్వరి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

0
44
purandeswari daggubati

టాలీవుడ్ మూవీ న్యూస్,విజయవాడ-పురందేశ్వరిని జాతీయ నాయకురాలిగా గుర్తిస్తూ బీజేపీ నాయకత్వం పదవీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆమె మాత్రం జాతీయ నాయకురాలిగా కాకుండా జాతి నాయకురాలిగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేసాడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల పాటు కొనసాగిన పురందేశ్వరి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దగ్గుబాటి పురందేశ్వరికి ఎన్టీఆర్ పెద్ద కూతురుగా మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే పరిపాలనా దక్షురాలు కూడా అని పదేళ్ల పాటు కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించి సత్తా చాటింది.

అయితే తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పురందేశ్వరిని పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి పురందేశ్వరికి. ఇదే సమయంలో ఈనాడు సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా . ఆ ఇంటర్వ్యూలో అమరావతి గురించి జగన్ పాలన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి పురందేశ్వరి పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.

పురందేశ్వరిని జాతీయ నాయకురాలిగా గుర్తించి పదవి ఇస్తే ఈమె మాత్రం కేవలం జాతి ( కమ్మ ) నాయకురాలిగా మిగిలిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. పురందేశ్వరి బీజేపీ లో కొనసాగుతుండగా ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు మాత్రం వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు. దాంతో భార్య ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో ఉంటే బాగుండదు ఏదో ఒకటి తేల్చుకోండి అని జగన్ సలహా ఇవ్వడంతో జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు దగ్గుబాటి. 

మునుపటి వ్యాసం53 ఏళ్ల వయసులో డిగ్రీ ఎలిజిబుల్ టెస్ట్ రాసిన హేమ
తదుపరి ఆర్టికల్ప్రణతి న్యూ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి