విజయ్ రెమ్యునరేషన్ 100 కోట్లు ?

0
24
vijay remuneration 100 crs for thuppakki 2 movie

ఇళయ దళపతి విజయ్ తాజాగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ 2 చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ చిత్రంలో నటిస్తున్నందుకు గాను విజయ్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి చెన్నైలో. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న అసలు సిసలైన మాస్ హీరో విజయ్ మాత్రమే ! దాంతో రజనీకాంత్ తో పోటీ పడి మరీ ఆ స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్.

రజనీకాంత్ ఒక్కో సినిమాకు ఒక్కో రేటు తీసుకుంటూ ఇప్పుడు ఏకంగా 107 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంటే రజనీకాంత్ కంటే కాస్త తక్కువ మాత్రమే ఈ విజయ్ తీసుకుంటున్నాడు. ఇక తుపాకి సంచలన విజయం సాధించింది కట్ చేస్తే ఆ చిత్రానికి సీక్వెల్ ఇన్నాళ్లకు రూపొందుతోంది. ఇక ఈ సీక్వెల్ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది విజయ్ సరసన. విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధమైంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి