మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ

0
23

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే పెద్ద సంచలనమే అని చెప్పాలి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు హీరో రాంచరణ్. మోహన్ లాల్ , పృథ్వీరాజ్ లు కీలక పాత్రల్లో నటించారు. మోహన్ లాల్ పాత్రని మెగాస్టార్ చిరంజీవి పోషిస్తుండగా పృథ్వీరాజ్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. ఆమేరకు దర్శకుడు సుజీత్ విజయ్ దేవరకొండ ని సంప్రదించాడట కూడా. ఎక్కువ సేపు ఉండదు కానీ ఉన్నంత వరకు అద్భుతంగా ఉంటుందట విజయ్ దేవరకొండ పాత్ర.

అయితే ఈ పాత్రలో నటించాలా ? వద్దా ? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదట ఈ క్రేజీ హీరో. తాజాగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రం చేస్తున్నాడు. కరోనా వల్ల ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి లూసిఫర్ రీమేక్ ఒప్పుకోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి – విజయ్ దేవరకొండ లను చూస్తే ఫ్యాన్స్ కు కేకే అని చెప్పాలి. సాహో దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సుజీత్ దర్శకత్వంలో ఈ లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. అప్పటి వరకు విజయ్ దేవరకొండ కూడా తన సమ్మతి తెలియజేయనున్నాడు.

మునుపటి వ్యాసంకరోనాతో టాలీవుడ్ హీరో తండ్రి మృతి
తదుపరి ఆర్టికల్మరో విషాదం : ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి