విజయ్ దేవరకొండ తదుపరి సినిమా

0
31
vijaydevarkonda next

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. ముంబై లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ ఫైటర్ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడో తెలుసా …….  మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణతో.

అవును శివ నిర్వాణ దర్శకత్వంలో నటించడానికి విజయ్ దేవరకొండ అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలు ఇంతకుముందే ఈ కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు కానీ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫైటర్ చిత్రం తర్వాత ఈ సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యారట విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ. ఇక ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది.

ఆర్మీ కమాండర్ గా విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తి తో పాటుగా ప్రేమ ని కూడా జోడించారట ఈ చిత్రానికి. యూత్ లో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి దాన్ని మరింత అద్భుతంగా మలచడానికి ఈ కథాంశం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మజిలీ , నిన్ను కోరి చిత్రాలతో విజయాలు అందుకున్న శివ నిర్వాణ తాజాగా నాని హీరోగా టక్ జగదీశ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా ఫైటర్ చిత్రం చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయ్యాక శివ తో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. 

మునుపటి వ్యాసంతమన్నా డిమాండ్ కు తలొగ్గిన నితిన్  
తదుపరి ఆర్టికల్అమెరికా వెళ్లనున్న సర్కారు వారి పాట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి