విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం సుకుమార్ తో

0
30
vijaydevarakonda, sukumar film

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమేరకు కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక విజయ్ దేవరకొండ అయితే సుక్కు సార్ …….. ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్ చేసాడు. ఈ కాంబినేషన్ లో రూపొందే భారీ చిత్రాన్ని విజయ్ దేవరకొండ స్నేహితుడు నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని 2022 లో విడుదల చేయనున్నాం అంటూ ప్రకటించారు కూడా. అంటే ఫైటర్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న మాట.


విజయ్ దేవరకొండతో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు అయితే విజయ్ దేవరకొండ మాత్రం హడావుడిగా కాకుండా తనకు తోచిన విధంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కొన్ని సడెన్ ట్విస్ట్ లను ఇస్తూ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. అసలు విజయ్ దేవరకొండ కోసం పలువురు దర్శకులు ఎదురు చూస్తున్నారు అలాగే పలువురు నిర్మాతలు కూడా అయితే వాళ్ళని పక్కన పెట్టి సుకుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో తన స్నేహితుడిని నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు.

సుకుమార్ తాజాగా అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నాడు. పుష్ప ఇప్పటికే రెండు షెడ్యూల్లు  జరిగాయి. అసలైన షెడ్యూల్స్ మాత్రం ముందు ముందు జరుగనున్నాయి. కరోనా వల్ల పుష్ప ఆలస్యం అయ్యింది కానీ లేదంటే ఈపాటికి అయిపోయేది. సుకుమార్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు బాగా నచ్చిందట దాంతో ఆగలేకపోతున్నా అంటున్నాడు ఈ క్రేజీ హీరో. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి