అల్లు అర్జున్ కు రౌడీ వేర్ పంపించిన విజయ్ దేవరకొండ

0
38
vijaydevara konda gifted rowdy ware to bunny

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తన రౌడీ వేర్ సంస్థ నుండి ప్రత్యేకంగా తయారు చేయించిన టీ షర్ట్ , ఫేస్ మాస్క్ , స్పెషల్ ట్రాక్ లను గిఫ్ట్ గా పంపించాడు విజయ్ దేవరకొండ. దాంతో ఖుషీ అయిన అల్లు అర్జున్ వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసాడు అలాగే విజయ్ దేవరకొండకు థాంక్స్ కూడా చెప్పాడు. విజయ్ దేవరకొండ ఫ్యాషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రౌడీ వేర్ అనే వ్యాపార సంస్థని నెలకొల్పాడు. దాంట్లో ఈతరం అమ్మాయిలకు , అబ్బాయిలకు కావాల్సిన రౌడీ వేర్ అంతా దొరుకుతుంది. స్టైలిష్ గా ఉండటంతో ఆన్ లైన్ లో అమ్మకాలు సాగించే ప్రక్రియ కావడంతో త్వరగా ఫేమస్ అయ్యింది రౌడీ వేర్.

విజయ్ దేవరకొండ స్టైలింగ్ చూసి ముచ్చటపడిన అల్లు అర్జున్ గతంలో తనకు కూడా నీలాంటి స్టైలింగ్ కావాలని కోరాడు దాంతో అప్పటి నుండి అల్లు అర్జున్ కొలతలు తీసుకున్న విజయ్ దేవరకొండ తరచుగా తన స్టైలింగ్ పంపిస్తూ అల్లు అర్జున్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం చేసున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప చిత్రంలో శ్రద్దా కపూర్ ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే …… ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోంది ఈ ఫైటర్ చిత్రం. మొత్తానికి టాలీవుడ్ హీరోలు పలువురు పాన్ ఇండియా చిత్రాలతో మంచి జోరు మీదున్నారు. 

మునుపటి వ్యాసంప్రభాస్ పై ట్వీట్ చేసిన రాధే శ్యామ్ డైరెక్టర్
తదుపరి ఆర్టికల్మలైకా అరోరాకు కూడా కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి