మరో చరిత్ర సృష్టించిన విజయ్ దేవరకొండ

0
39
vijay devarakonda

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరో చరిత్ర సృష్టించాడు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా నెలకొల్పిన రికార్డ్ ఏంటో తెలుసా ……. ఇన్ స్టా గ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఏకైక దక్షిణాది స్టార్ వన్ అండ్ ఓన్లీ విజయ్ దేవరకొండ. అవును తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ ని ఫాలో అయ్యేవాళ్ళు 9 మిలియన్ లను దాటేసారు. ఇన్ స్టా లో ఇంతమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరూ లేరు దక్షిణ భారతదేశంలో.

ఆ అరుదైన ఘనత కేవలం విజయ్ దేవరకొండ సాధించాడు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి చిత్రం బాగా ఉపయోగపడింది అందుకే యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్ ఐకాన్ గా ఈ హీరో నిలిచాడు అందుకే అంతటి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ హీరోకు. అమ్మాయిల గుండెల్లో మంటలు పెడుతున్న ఈ హీరోకు అమ్మాయిల్లోనే కాకుండా అబ్బాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అందుకే  తనని ఇంతగా అభిమానిస్తున్న యువతకు ధన్యవాదాలు తెలిపాడు విజయ్ దేవరకొండ.

తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఫైటర్ చిత్రాన్ని కంప్లీట్ చేసాక సుకుమార్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రాన్ని చేయనున్నాడు విజయ్ దేవరకొండ. సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు విజయ్ దేవరకొండ. విభిన్న కథా చిత్రాలని చేస్తూ సుకుమార్ తన విభిన్నతని చాటుతూనే ఉన్నాడు. అందుకే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేస్తున్నాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి