తమ్ముడి కోసం నిర్మాతగా మారుతున్న విజయ్ దేవరకొండ

0
46
vijay devarakonda

తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం నిర్మాతగా మారుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అయితే నటుడిగా మాత్రం ఆనంద్ దేవరకొండకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మరో సినిమా అంగీకరించాడు ఆనంద్ దేవరకొండ. అయితే ఈలోగా కరోనా మహమ్మారి రావడంతో షూటింగ్ లన్ని ఆగిపోయాయి. కరోనా వల్ల సినిమారంగంలోని అందరికీ గ్యాప్ దొరకడంతో రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.

అలాగే రకరకాల కథలను రాసుకుంటున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండకు ఓ ఆలోచన వచ్చిందట. తన తమ్ముడిని హీరోగా పెట్టి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రాగానే దాన్ని సందీప్ రెడ్డి వంగాకు చెప్పాడట. ఇంకేముంది సందీప్ రెడ్డి వంగా కూడా ఖాళీగా ఉన్నాడు దాంతో ఇది మంచి ఆలోచనే అని భావించి వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టారట. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు విజయ్ దేవరకొండ నిర్మాత అన్నమాట ఈ వెబ్ సిరీస్ కు.

సాఫ్ట్ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు రౌడీ ఇమేజ్ రావడానికి కారకుడు సందీప్ రెడ్డి వంగా అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగు సినిమా స్టైల్ ని కూడా మార్చేసింది. ఇక విజయ్ దేవరకొండ ఒక్కసారిగా సడెన్ స్టార్ అయ్యాడు అర్జున్ రెడ్డి చిత్రంతో. కట్ చేస్తే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి పనిచేయలేదు. కానీ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం మళ్ళీ కలుస్తున్నారు. ఈ దెబ్బతో ఆనంద్ దేవరకొండ కు కూడా రౌడీ ఇమేజ్ వస్తుందేమో చూడాలి. 

మునుపటి వ్యాసందృశ్యం దర్శకుడు కన్నుమూత
తదుపరి ఆర్టికల్నటి మాధవీలతపై కేసు నమోదు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి