చిరంజీవి ఆచార్యలో విజయ్ దేవరకొండ

0
60
aacharya chiranjeevi poster

చిరంజీవి ఆచార్యలో విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఆ చిత్రంలో కీలకమైన పాత్రలో మొదట మహేష్ బాబుని అనుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు. దాంతో రాంచరణ్ చేత ఆ పాత్ర చేయిస్తే బాగుంటుందని మెగా అభిమానులకు కూడా మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్ అవుతుందని అనుకున్నారు. ఇప్పటికైతే ఇదే కన్ఫర్మ్ కానీ తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఆ కీలక పాత్రలో విజయ్ దేవరకొండ అయితే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారట దర్శకుడు కొరటాల శివ.

అసలే అది రెబల్ పాత్ర అలాంటి రెబల్ పాత్రకు రౌడీ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ అయితే మరింత అద్భుతంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు కొరటాల శివ. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ దాంతో రెబల్ పాత్రలో రౌడీ ఇమేజ్ ఉన్నవాడు నటిస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు చేస్తున్నాడట. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ పాత్ర పోషిస్తే తెరమీద చిరంజీవి – విజయ్ దేవరకొండ లను చూస్తే ప్రేక్షకులు పరవశించి పోవడం ఖాయం.

విజయ్ దేవరకొండతో ఓ సామాజిక సందేశం ఉన్న చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే ఒకటి రెండు సార్లు కలిసారట , చర్చలు కూడా జరిగాయట. అయితే ఎవరికి వాళ్లకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కుదరలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతోంది ఈ కాంబినేషన్. ఒకవేళ ఆచార్య లో కనుక విజయ్ దేవరకొండ నటిస్తే ఓ క్రేజీ కాంబినేషన్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఇటీవలే ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల కాగా దానికి మంచి స్పందన వస్తోంది. ఇక ఆచార్య తర్వాత కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నాడు. విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రంలో నటిస్తున్నాడు.

మునుపటి వ్యాసంషాక్ ల మీద షాక్ లు ఇస్తున్న రాజమౌళి
తదుపరి ఆర్టికల్మహబూబ్ నగర్ అడవుల్లో అల్లు అర్జున్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి