మరోసారి సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ

0
44
VIJAY

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి సంచలనం సృష్టించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఇన్ మెన్ జాబితాలో ఏకంగా దేశ వ్యాప్తంగా టాప్ 3 లో నిలిచాడు. భారతదేశ వ్యాప్తంగా టాప్ టెన్ జాబితా అని విడుదల చేయగా బాలీవుడ్ స్టార్ హీరోలు షాహిద్ కపూర్ నెంబర్ వన్  స్థానం ఆక్రమించగా సెకండ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ నిలిచారు. ఇక విజయ్ దేవరకొండ నెంబర్ 3 గా నిలిచి సత్తా చాటాడు. టాప్ టెన్ లో ఒక్క టాలీవుడ్ హీరో కూడా లేడు కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఆ జాబితాలో నిలవగా టాప్ 3 లో చోటు దక్కించుకోవడం విశేషం.

విజయ్ దేవరకొండ గత ఏడాది నటించిన సినిమాలు ఏవి కూడా విడుదల కాలేదు , అంతకుముందు విడుదల అయిన చిత్రాలు కూడా అంతగా ఆడలేదు అట్టర్ ప్లాప్ అయ్యాయి. విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ క్రేజ్ లో మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు ఈ హీరో. పెళ్లి చూపులు చిత్రంతో సోలోగా సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి తిరుగులేని విజయాన్ని అందించడమే కాకుండా స్టార్ ని చేసింది.

ఇక గీత గోవిందం చిత్రంతో మరింతగా స్టార్ డం వచ్చి పడింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కరోనా తగ్గిన తర్వాత ఫైటర్ చిత్రం పట్టాలెక్కనుంది. 

మునుపటి వ్యాసంఎన్టీఆర్ మళ్ళీ ఆ ఇద్దరు డైరెక్టర్ లతో
తదుపరి ఆర్టికల్50 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి రెడీ అవుతున్న భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి