అభినందన్ వర్ధమాన్ పాత్రలో విజయ్ దేవరకొండ

0
17
vijay devarakonda

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాత్రలో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అంటే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు లేదా కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు కానీ పాకిస్థాన్ సైనికుల చేతికి చిక్కినా తన మాతృభూమి కోసం ధైర్యంగా నిలబడి పాకిస్థాన్ సైనికులు మళ్ళీ భారత్ కు అప్పగించిన వ్యక్తి , శక్తి ఈ అభినందన్ వర్ధమాన్ . కొంతకాలం క్రితమే జరిగిన ఈ సంఘటన యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. క్షేమంగా అభినందన్ వర్ధమాన్ ఇండియాకు రావడంతో హీరోగా కీర్తించారు.


కట్ చేస్తే అతడి జీవితకథతో ఓ సినిమా చేయాలనీ బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకుముందు అభిషేక్ హిందీలో కాయ్ పో చే , కేదారినాథ్ తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడేమో బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది పైగా బాలీవుడ్ లో బయోపిక్ లు దాదాపుగా బ్లాక్ బస్టర్ లు అవుతున్నాయి దాంతో కాబోలు ఇలా ప్లాన్ చేసాడు అభిషేక్.

ఇక ఈ కథ విన్న విజయ్ దేవరకొండ నటించడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని హిందీలో పెద్ద ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండో – పాక్ యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయి కాబట్టి అగ్ర నిర్మాతలు భూషణ్ కుమార్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరు కూడా ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి