ఇందిరాగాంధీగా విద్యాబాలన్

0
44
vidaya

 

ఇండియన్ ఐరన్ లేడీగా ముద్రపడిన నాయకురాలు ఇందిరాగాంధీ. భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని చిరస్థాయిగా లిఖించుకున్న లీడర్ ఇందిర. ఒక మహిళ అయి ఉండి భారతదేశాన్ని ఏలిన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇందిర జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆ బయోపిక్ లో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించనుంది. కరోనా రాకపోతే ఈపాటికి ఇందిరాగాంధీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం అయ్యేదే అనుకుంటా ? కానీ కరోనా మహమ్మారి వల్ల అనుకున్న విధంగా పనులు సాగకపోవడంతో వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ బయోపిక్ ని విద్యాబాలన్ భర్త అగ్ర నిర్మాత ఆదిత్య రాయ్ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మిత గా నటించి మెప్పించిన విద్యాబాలన్ తాజాగా శకుంతలా దేవిగా కూడా మెప్పించింది. అలాగే ఆమధ్య ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కూడా మెప్పించింది. భారీ అందాల భామ అయిన విద్యాబాలన్ ఎలాంటి పాత్ర నైనా సరే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఇక యావత్ భారతదేశ సార్వభౌమత్వాన్ని తన చేతుల్లో పెట్టుకున్న ఇందిరగా విద్యాబాలన్ నటన నభూతో నభవిష్యత్ అనేలా ఉండటం ఖాయం అనిపిస్తోంది.

మునుపటి వ్యాసంపొట్టి నిక్కర్ లో హీట్ పెంచుతున్న అమలా పాల్
తదుపరి ఆర్టికల్విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి