విక్కీ డోనర్ నటుడు మృతి

0
53
bhupesh kumar passes away

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబయి,బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిత్రం ” విక్కీ డోనర్ ”. కాగా ఆ చిత్రంలో నటించిన భూపేష్ కుమార్ పాండ్య నిన్న రాత్రి (సెప్టెంబర్ 23 న ) మరణించాడు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భూపేష్ కుమార్ పాండ్య లంగ్స్ క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే క్యాన్సర్ వ్యాధి ముదరడంతో నిన్న రాత్రి ముంబై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు భూపేష్ కుమార్ పాండ్య.

భూపేష్ మృతి విషయాన్ని అతడి భార్య ఛాయ అధికారికంగా వెల్లడించింది. ఇంతకుముందు కూడా తన భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని , ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపింది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఖరీదైనది కావడంతో భూపేష్ కుమార్ పాండ్య కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. దాంతో నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో పాటుగా భూపేష్ స్నేహితులు విరాళాలు సేకరించారు ట్రీట్ మెంట్ కోసం. అయితే భూపేష్ ని దక్కించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండిపోయింది దాంతో భూపేష్ స్నేహితులు , అతడి కుంటుంబం తీవ్ర విషాదంలో మునిగారు. 

మునుపటి వ్యాసంహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు
తదుపరి ఆర్టికల్కరోనాతో టాలీవుడ్ నటుడు మృతి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి