వేశ్యగా నటించడానికి సిద్ధమౌతున్న భామ

0
22

రకుల్ ప్రీత్ సింగ్ వేశ్య పాత్రలో నటించడానికి ఉత్సాహం చూపిస్తోంది. వేశ్య పాత్రల్లో నటించిన పలువురు హీరోయిన్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి దాంతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వేశ్యగా నటించడానికి ఆసక్తి చూపిస్తోందట. వేశ్య కు సంబంధించిన కథ ఒకరు చెప్పారట దాంతో ఆ పాత్రని ఒప్పుకోవాలని భావిస్తోందట రకుల్ ప్రీత్. ఇలాంటి పాత్రల్లో నటించడం ద్వారా తనలోని నటనాశక్తి మరింతగా వెలుగులోకి రావడం ఖాయమని తద్వారా తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే క్యారెక్టర్ అవుతుందని భావిస్తోందట.

రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. మన్మథుడు2 తర్వాత రకుల్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. తెలుగులో నితిన్ సినిమా తప్ప మరో ఛాన్స్ లేకుండాపోయింది. అయితే గుడ్డిలో మెల్ల లాగా తమిళంలో ఒకటి ఆరా చిత్రాలు ఉన్నాయి ఈ భామకు. కానీ కరోనా వల్ల షూటింగ్ లు లేకుండాపోయాయి. దాంతో ఢిల్లీ లో కాలక్షేపం చేస్తోంది. ఖాళీ సమయం ఎక్కువ లభించడంతో యోగా మాత్రం ఆపడం లేదు. యోగాసనాలు వేస్తూ టైమ్ పాస్ అయ్యేలా చేస్తోంది.

మునుపటి వ్యాసంసొగసు చూడ తరమా చిత్రానికి 25 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్చిరంజీవి చిన్నల్లుడికి కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి