వర్మకు జరిమానా విధించిన గ్రేటర్ హైదరాబాద్

0
36

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అనే సినిమా పోస్టర్ లను హైదరాబాద్ లో పలు చోట్ల అనుమతి లేకుండా వేయించినందుకు గాను 4 వేలు జరిమానా విధించారు. లాక్ డౌన్ సమయం తర్వాత ఎవరు కూడా వాల్ పోస్టర్ లను వేయలేదు. పైగా జీహెచ్ ఎంసీ అధికారుల అనుమతి లేకుండా పోస్టర్ లను వేయొద్దు అందునా ప్రభుత్వ స్థలాలలో వేయొద్దు కానీ పవర్ స్టార్ పోస్టర్ లను వేశారు. పైగా పవర్ స్టార్ పోస్టర్ లను హైదరాబాద్ మహానగరంలో వేసినట్లుగా స్వయంగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

దాంతో ఓ వ్యక్తి ఈ విషయాన్ని జీహెచ్ ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రాంగోపాల్ వర్మకు 4 వేలు ఫైన్ వేశారు జీహెచ్ ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ అధికారులు వర్మకు ఫైన్ వేశారు బాగానే వుంది కానీ రాంగోపాల్ వర్మ ఈ జరిమానా కడతాడా ? అన్నది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పాలి. ఎందుకంటే వర్మ ఎలాగైనా మాట్లాడతాడు. ఆ పోస్టర్ లతో నాకు సంబంధం లేదని తప్పించుకున్నా తప్పించుకోగలడు ఎందుకంటే అతడు రాంగోపాల్ వర్మ కాబట్టి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి