డబుల్ గేమ్ ఆడుతున్న  వర్మ

0
57
rgv

దర్శకులు రాంగోపాల్ వర్మ అడ్డంగా బుక్కయ్యాడు కోర్టు ముందర. నాకు కరోనా సోకిందని అందుకే అఫిడవిట్ పై సంతకం చేయలేకపోయానని తన లాయర్ చేత చెప్పించాడు మిర్యాలగూడ కోర్టుకి. అయితే అంతకుముందే నాకు కరోనా సోకలేదు అంటూ ఓ వీడియోని విడుదల చేయడమే కాకుండా నిన్న సాయంత్రం అప్సరా రాణితో కలిసి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. అంటే ఒకవేళ కరోనా ఉంటే వచ్చే అవకాశం లేదు కానీ కోర్టు కేమో కరోనా సోకిందని తెలిపి , బయటేమో ఇలా చేస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు వర్మ. దాంతో కోర్టు సీరియస్ గా పరిగణిస్తే తప్పకుండా కోర్టు ధిక్కారణ కిందకు రావడం ఖాయం.

రాంగోపాల్ వర్మ రూపొందించిన మర్డర్ చిత్రంపై అభ్యంతరం చెబుతూ కోర్టు కెక్కింది అమృత. అయితే నేను న్యాయపోరాటం చేస్తానని చెప్పిన వర్మ ఇలా కరోనా సోకిందని తప్పించుకున్నాడు. ఒకవేళ కరోనా వస్తే అప్సరా రాణితో కలిసి లైవ్ లోకి ఎలా వస్తాడు అన్నదే ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్న. అప్సరా రాణి మెయిన్ క్యారెక్టర్ గా థ్రిల్లర్ అనే సినిమాని రూపొందించాడు వర్మ . ఆ సినిమా కూడా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది. లైవ్ లోనే అప్సర అందాలను పొగుడుతూ తన బుద్ది చూపించుకున్నాడు వర్మ. మొత్తానికి కరోనా సమయంలో షూటింగ్ చేయడానికి అందరూ భయపడుతుంటే వర్మ మాత్రం ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 

మునుపటి వ్యాసంసంజయ్ దత్ కు క్యాన్సర్ ?
తదుపరి ఆర్టికల్ఈసారి చిరు బర్త్ డే ప్రత్యేకతలు ఏంటో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి