వర్మపై సెటైర్ వేసిన హీరో

0
61
TMN logo
TMN logo

హీరో నిఖిల్ వర్మపై సెటైర్ వేసాడు. పవన్ కళ్యాణ్ ని మహాశిఖరంతో పోల్చుతూ వర్మ ని మాత్రం కుక్కతో పోల్చాడు. అయితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు కానీ రాంగోపాల్ వర్మ పేరు కానీ                ఊపయోగించలేదు. నిఖిల్ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వర్మ ని అభిమానించే వాళ్ళు మాత్రం నిఖిక్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శిస్తున్నారు. ఈ గోలంతా ఎందుకంటే పవర్ స్టార్ అనే సినిమా వల్ల. తాజాగా పవర్ స్టార్ చిత్రం నుండి ట్రైలర్ విడుదల కావడమే.

పవర్ స్టార్ అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ ని మరింత చులకనగా చూపించి నట్లు తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిఖిల్ కు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం దాంతో పవన్ కళ్యాణ్ ని మహాశిఖరం తో పోల్చాడు అలాగే వర్మ ని కుక్కతో పోల్చుతూ పోస్ట్ పెట్టాడు. నిఖిల్ పోస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతోంది. తాజాగా నిఖిల్ కార్తికేయ 2 చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కార్తికేయ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా రూపొందనుంది కార్తికేయ 2.

మునుపటి వ్యాసంపవర్ స్టార్ ట్రైలర్
తదుపరి ఆర్టికల్నిరాడంబరంగా జరిగిన ఎంగేజ్మెంట్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి