వనిత మూడో భర్తకు గుండెపోటు

0
37
vanitha,peter

వనిత మూడో భర్తకు గుండెపోటు

నటి వనిత విజయ్ కుమార్ ఇటీవలే పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకొని రెండు నెలలు కూడా కాలేదు పాపం అప్పుడే కష్టాలు వచ్చి పడ్డాయి వనితకు. పీటర్ పాల్ కు గుండెపోటు రావడంతో చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు వైద్యం కోసం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పీటర్ పాల్. ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్ కు పెళ్లి అయినప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. రెండు నెలల కాపురం చేయకుండానే ఇలా భర్త ఆసుపత్రిలో చేరడంతో కన్నీళ్ల పర్యంతం అవుతోంది వనిత విజయ్ కుమార్.

పీటర్ పాల్ – వనిత విజయ్ కుమార్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు కానీ గత కొంత కాలంగా ఇద్దరు కూడా సహజీవనం చేస్తూనే ఉన్నారు. సహజీవనం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దాంతో వనిత తన పిల్లల సమక్షంలోనే పీటర్ ని పెళ్లి చేసుకుంది. వనిత తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది అయితే నటిగా అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది కానీ ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.

ప్రముఖ నటులు విజయ్ కుమార్ – మంజుల ల కూతురు ఈ వనిత. ఈమెతో పాటుగా వనిత కుటుంబంలోని మిగతా వాళ్ళు కూడా నటులే. అయితే వనిత సిస్టర్స్ కూడా హీరోయిన్ లుగా తెలుగు , తమిళ చిత్రాల్లో నటించినప్పటికి వాళ్ళు కూడా అంతగా రాణించలేక పోయారు. దాంతో వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో స్థిరపడగా వనిత మాత్రం ఇలా ఇబ్బందులు పడుతూనే ఉంది పాపం. తన భర్త ఆసుపత్రిలో చేరేసరికి దేవుడి మీదే భారం వేసింది పాపం.

మునుపటి వ్యాసంచిరంజీవి ఆచార్య కథ పై కాపీ ఆరోపణలు
తదుపరి ఆర్టికల్మహేష్ బాబు కోసం క్యూలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి