వకీల్ సాబ్ టీజర్ రెడీ అవుతోంది

0
84

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా టీజర్ ని విడుదల చేయాలాని డిసైడ్ అయ్యారట నిర్మాత దిల్ రాజు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు బోనీ కపూర్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా నటిస్తుండగా మలయాళ భామ నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది. నివేదా థామస్ తో పాటుగా హీరోయిన్ అంజలి కూడా నటిస్తోంది ఈ చిత్రంలో.

అయితే కరోనా వల్ల షూటింగ్ లన్నీ ఆగిపోయాయి దాంతో అందరితో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశతో వున్నారు. అందుకే వాళ్ళని ఉత్సాహపరచడానికి వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. టీజర్ విడుదల చేస్తారు కానీ అది ఇప్పుడు కాదు సుమా…… సెప్టెంబర్ 2 న . సెప్టెంబర్ 2 న ఎందుకు టీజర్ విడుదల అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తెలుసు ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ పుట్టినరోజు మరి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 2 అంటే చాలా రోజులే ఉంది కాని తప్పదు మరి.  

మునుపటి వ్యాసంకరోనా వస్తే గాంధీ ఆస్పత్రి లో చేరతానంటున్న మంత్రి
తదుపరి ఆర్టికల్ఈ ముగ్గురిలో మహేష్ కు తగ్గ విలన్ ఎవరు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి