వైరస్ గాండ్లపై నిప్పులు కక్కిన కొరటాల శివ

0
57

కరోనా వైరస్ కొంతమందికి సోకినప్పటికి ఆ విషయాన్ని దాచి బయట తిరుగుతూ ఇతరులకు అంటిస్తూ సభ్య సమాజానికి హాని కలిగిస్తున్న వాళ్ళ ని క్షమించాల్సిన అవసరం లేదని వైరస్ గాండ్లపై నిప్పులు కక్కాడు దర్శకుడు కొరటాల శివ. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో సమాజం అంతా భయపడుతుంటే కొంతమంది కరోనా సోకిన వాళ్ళు మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టి ఇతరులకు అంటించాలని చూస్తున్నారని అలాంటి ద్రోహులను ఏం చేసినా పాపం లేదంటున్నాడు కొరటాల శివ.

సామాజిక సందేశం కలిగిన చిత్రాలను అందిస్తున్న దర్శకుడు కొరటాల. ఇప్పటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాలు కూడా సామాజిక సందేశం నేపథ్యంలోనే రూపొందించాడు. తాజాగా ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమా కూడా సందేశాత్మకంగా రూపొందుతోంది. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కావడంతో సమాజానికి కాస్త అయినా మంచి చేసే చిత్రాలను అందించాలని కంకణం కట్టుకున్నారు కొరటాల శివ. అందుకే తాను నమ్మిన సిద్ధాంతం కోసం బాగానే కష్టపడుతున్నాడు. అందుకే సమాజానికి హాని కలిగించే వ్యక్తులు అంటే కొరటాల శివ కు ఎక్కడ లేని కోపం.  

మునుపటి వ్యాసంఈ ముగ్గురిలో మహేష్ కు తగ్గ విలన్ ఎవరు
తదుపరి ఆర్టికల్రజనీకాంత్, విజయ్ లపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి