“వి” రివ్యూ నాని , సుధీర్ బాబు, నివేదా థామస్ , అదితి రావు

0
187
v movie about story

“వి” రివ్యూ
నటీనటులు : నాని , సుధీర్ బాబు, నివేదా థామస్ , అదితి రావు హైదరీ తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం : తమన్
ఛాయాగ్రహణం : పీజీ విందా
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
రేటింగ్ : 3 /5
విడుదల తేదీ : 5 సెప్టెంబర్ 2020

నాని , సుధీర్ బాబు , నివేదా థామస్ , అదితి రావు హైదరీ తదితరులు నటించిన వి చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ ఏడాది మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా థియేటర్ లో విడుదల కాలేదు. దాంతో ఇన్నాళ్ల తర్వాత ఓటీటీలో విడుదల అయ్యింది. ఓటీటీ లో విడుదలైన మొదటి క్రేజీ చిత్రం ఈ వి. మరి ఈ వి ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

విష్ణు ( నాని) ఓ పోలీస్ అధికారిని చంపడమే కాకుండా మరో నలుగురిని కూడా చంపుతానని , దమ్ముంటే అడ్డుకోవాలని డీసీపీ ఆదిత్య ( సుధీర్ బాబు ) కు సవాల్ విసురుతాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన డీసీపీ ఆదిత్య విష్ణు సవాల్ ని ఛాలెంజ్ గా తీసుకొని విష్ణు చేస్తున్న హత్యలను ఆపడానికి ట్రై చేస్తాడు. ఇదే సమయంలో రచయిత్రి అపూర్వ (నివేదా థామస్ ) డీసీపీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. విష్ణు హత్యల కేసు చేధించేందుకు ఆదిత్యకు సహకరిస్తుంది. అసలు విష్ణు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? దాని వెనుక ఉన్న అసలు సంఘటన ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

నాని
సుధీర్ బాబు
స్క్రీన్ ప్లే
ఫస్టాఫ్
యాక్షన్ ఎపిసోడ్స్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

సైకో పాత్రలో నాని నటన అద్భుతం అనే చెప్పాలి. మొదట విలన్ గా అనిపించే ఈ క్యారెక్టర్ ఆ తర్వాత ఎందుకు హత్యలు చేస్తున్నాడో తెలిసిన తర్వాత హీరోగా టర్న్ అవుతుంది. నాని గెటప్ లోనే కాదు నటనలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు దాంతో అతడి నటజీవితంలో మరో మైలురాయిగా నిలిచింది ఈ వి. ఇక సుధీర్ బాబు – నాని ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు కూడా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో నాని మాత్రమే హీరో కాదు సుధీర్ బాబు కూడా అని అనిపించడం ఖాయం సినిమా చూశాక. సుధీర్ బాబు నటజీవితంలో కూడా ఈ క్యారెక్టర్ నిలిచిపోవడం ఖాయం. అదితి రావు హైదరీ సాహెబా పాత్రలో నటించింది. అదితి రావు హైదరీ పాత్ర చిన్నదే కానీ ఉన్నంత వరకు బాగానే ఉంది. నివేదా థామస్ పాత్ర కూడా చిన్నదే కానీ ఉన్నంతలో ఫరవాలేదనిపించింది.

సాంకేతిక వర్గం :

తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. అమిత్ త్రివేది అందించిన పాటలు బాగానే ఉన్నాయి కానీ అవి ఈ సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. పీజీ విందా ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే …… ఇన్నాళ్లు లైటర్ వేలో సినిమాలను రూపొందించి జెంటిల్ మెన్ చిత్రం నుండి కాస్త రూటు మార్చాడు. యాక్షన్ చిత్రాలను సైతం నేను రూపొందించగలను అని వి చిత్రంతో నిరూపించాడు. అయితే సెకండాఫ్ లో కాస్త సాగతీత సన్నివేశాలను తొలగిస్తే బాగుండేది. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నప్పటికి కొంత నిరుత్సాహపరిచాడు అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా :

యాక్షన్ సన్నివేశాలతో సాగిన వి లో సరికొత్త నాని , అలాగే సుధీర్ బాబు లను చూపించాడు. మొత్తానికి థియేటర్లు తెరుచుకోలేని ఈ సమయంలో అమెజాన్ ప్రేక్షకులకు కనువిందు అనే చెప్పాలి ఈ వి.

మునుపటి వ్యాసంచిరంజీవి తీసుకున్న నిర్ణయంతో షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్
తదుపరి ఆర్టికల్షాకింగ్ న్యూస్: హీరోయిన్ పై దాడి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి