ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ

0
68

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇందిరాగాంధీ మనవరాలు రాజీవ్ గాంధీ – సోనియా గాంధీ ల కూతురు ప్రియాంకా గాంధీ ని ప్రకటించారు సీడబ్ల్యూసీ మెంబర్ జితిన్ ప్రసాదా. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. యోగి ప్రభుత్వాన్ని డీ కొట్టాలంటే ఇందిరాగాంధీ మనవరాలు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే సాధ్యం అవుతుందని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అధిష్టానం. సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు జితిన్ ప్రసాదా.

ఒకప్పుడు కాంగ్రెసు పార్టీకి కంచుకోటగా ఉండేది ఉత్తరప్రదేశ్. కానీ కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోవడంతో ప్రాంతీయ పార్టీ లైన సమాజ్ వాది పార్టీ , బహుజన్ సమాజ్ వాది పార్టీ , జనతాదళ్ లు బలోపేతం అయ్యాయి. అయితే ప్రాంతీయ పార్టీల బలహీనతలతో బీజేపీ పుంజుకుంది. యోగి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే యోగి హయాంలో ఎన్ కౌంటర్ లు మినహా సాధించిన ప్రగతి లేదని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది ప్రియాంకా గాంధీ. గాంధీ కుటుంబం నుండి పోటీకి దిగుతోంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయేమో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి