శృంగార తార తెలుగులో బ్లాక్ రోజ్ గా వస్తోంది

0
58

శృంగార తార ఊర్వశి రౌతేలా తెలుగులో మొదటిసారిగా నటిస్తున్న చిత్రం ” బ్లాక్ రోజ్ ”. దర్శకులు సంపత్ నంది క్రియేటివ్ టీమ్ అందిస్తున్న ఈ చిత్రం ఈనెల 17 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఏంటి ? కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో బాలీవుడ్ హాట్ భామ నటించడానికి ధైర్యం చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? కోవిడ్ నిబంధనలను అనుసరించే కరోనా టెస్ట్ లు చేయించుకొని మరీ షూటింగ్ చేస్తున్నారట బ్లాక్ రోజ్ చిత్ర యూనిట్.

ఊర్వశి రౌతేలా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న భామ. తన అందాలను ఉదారంగా ఆరబోస్తూ యువతని పిచ్చెక్కిస్తున్న ఈ భామ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇన్నాళ్లకు తెలుగులో కూడా నటించడానికి సిద్ధమైంది ఊర్వశి రౌతేలా. బ్లాక్ రోజ్ గా కుర్రాళ్ళని పిచ్చెక్కించడానికి వస్తోంది. కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే కథే ఈ బ్లాక్ రోజ్. విలాసవంతమైన జీవితం కోసం అడ్డదార్లు తొక్కితే దాని పర్యవసానం ఏంటి ? ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ బ్లాక్ రోజ్ కథాంశం అన్నమాట. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు , హిందీ భాషల్లో రూపొందనుంది.

ఇక దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి రచన అందిస్తున్నాడు. దర్శకుడిగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది అడపా దడపా నిర్మాతగా మారి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఈసారి నిర్మాతగా కాకుండా రచన అందించాడు. మరి ఈ సినిమా విజయం సాధిస్తుందా ? లేదా ? అన్నది తేలాల్సి ఉంది. హాట్ భామ ఊర్వశి రౌతేలా నటిస్తున్న చిత్రం కాబట్టి తప్పకుండా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. కథ , కథనం బాగుంటే తప్పకుండా హిట్ అవుతుంది లేదంటే షరా మాములే.

మునుపటి వ్యాసంపుకార్లపై మండిపడిన సురేఖావాణి
తదుపరి ఆర్టికల్ప్రభాస్ 3 సినిమాలు 11 వందల కోట్ల బడ్జెట్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి