అనవసరంగా మీడియా ప్రచారం- ఖండించిన నమ్రత

0
38
media blaming namratha
టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు పట్టి పీడిస్తోంది. బాలీవుడ్. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతూ డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారణ చేయడంతో 25 మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. కట్ చేస్తే డ్రగ్ డీలర్లు వెల్లడించిన పేర్లలో మహేష్ బాబు భార్య నటి నమ్రత శిరోద్కర్ పేరు కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం చెలరేగింది. మహేష్ బాబు భార్య పేరు డ్రగ్స్ కేసులో లీక్ కావడంతో వైరల్ గా మారింది.

అయితే నమ్రత పేరు తెలుగు మీడియాలో కూడా నానడంతో ఎట్టకేలకు స్పందించింది నమ్రత . డ్రగ్స్ కేసులో నా పేరు ఉన్నట్లుగా అనవసరంగా మీడియా ప్రచారం చేస్తోంది. కొంతమంది కావాలనే ఇలా రాద్ధాంతం చేస్తున్నారు. నాకు డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది నమ్రత శిరోద్కర్. అయితే జాతీయ మీడియాలో నమ్రత – సాహో ల వాట్సాప్ చాట్ ప్రసారం అయ్యింది. ఆ చాట్ ప్రకారం నమ్రత శిరోద్కర్ పేరు అయితే ఉంది కాని నమ్రత మాత్రం నాకు సంబంధం లేదని అంటోంది.

నమ్రత పేరు మీడియాలో నానడం మహేష్ బాబుకు పెద్ద తలనొప్పి వ్యవహారం అన్నమాటే. టాలీవుడ్ లో మహేష్ బాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి మహేష్ బాబుకు ఇప్పుడు డ్రగ్స్ కేసు రూపంలో అపవాదు వచ్చి పడింది. ఈ అపవాదు వల్ల కొంత ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం ఖాయం. నమ్రత అంటే మరో నమ్రత అని అర్థమా ? లేక మహేష్ బాబు భార్య నమ్రతనా ? అన్నది విచారణలో తేలనుంది. అయితే అప్పటి వరకు మహేష్ బాబుకు ఇబ్బందికరమైన విషయమే.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి