ఎన్టీఆర్ కోసం ఇద్దరు హాట్ భామలు

0
32
Two Hot heroine for jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంతో కలిసి ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు కాగా అందులో ఒకరిని పూజా హెగ్డే గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్కరు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఒక్కరి కోసం ఏకంగా ఇద్దరు బాలీవుడ్ హాట్ భామలను సంప్రదిస్తున్నారట దర్శకులు త్రివిక్రమ్.

ఇక ఆ ఇద్దరు హాట్ భామలు ఎవరో తెలుసా …….. ఒకరు జాన్వీ కపూర్ కాగా మరొకరు అలియా భట్. ఈ ఇద్దరు భామలను సంప్రదిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఒకరిని ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయించడానికి సన్నద్ధం అవుతున్నాడు త్రివిక్రమ్. జాన్వీ కపూర్ ఒప్పుకున్నా , అలియా భట్ ఒప్పుకున్నా ఇద్దరు కూడా కంచులే కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ ఆడియన్స్ కూడా సంతోషించడం ఖాయం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి