డ్రగ్స్ కేసులో పీకల్లోతు ఇరుక్కున్న ఇద్దరు హీరోయిన్లు

0
65
sanjana ragini divedhi
కర్ణాటకలో డ్రగ్స్ కేసు తాజాగా సంచలనం సృష్టిస్తోంది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. రవితేజ , ఛార్మి , పూరి జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, నందు , ముమైత్ ఖాన్ , సుబ్బరాజు , నవదీప్ , తనీష్ తదితరులను సిట్ అధికారులు సమన్లు జారీ చేసి పలుమార్లు విచారించారు. అప్పట్లో ఈ కేసు టాలీవుడ్ ని షేక్ చేసింది. సిట్ అధికారులు టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న తీరుని పెద్దగా ఫోకస్ చేసింది మీడియా. కట్ చేస్తే ఆ కేసులో అరెస్ట్ లు తప్పదని , శిక్షలు కూడా పడతాయని పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏముంది షరా మాములే.

ఇక ఇప్పుడు కర్ణాటక లో  డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇక్కడ కూడా పలువురు సినిమా ప్రముఖులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ఇద్దరు హీరోయిన్ లు రాగిణి ద్వివేది , సంజన పేర్లు బయటకు వచ్చాయి. రాగిణి ద్వివేది సన్నిహితుడైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సంజన సన్నిహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాగిణి ద్వివేది ని విచారణకు రమ్మంటే తప్పించుకుంటోంది అనారోగ్యం సాకుతో. దాంతో పోలీసులు రాగిణి డ్రగ్స్ వాడకంపై అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. అలాగే సంజన పై కూడా గట్టి చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఇద్దరు హీరోయిన్ లు మాత్రమే కాదు ఇంకా లిస్ట్ పెద్దదే ఉందట పోలీసుల దగ్గర. దాంతో శాండల్ వుడ్ లో కలకలం మొదలైంది. అయితే రాగిణి ద్వివేది కానీ సంజన కానీ ఈ డ్రగ్స్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. వీళ్ళ సమాధానం ఇలా ఉన్నప్పటికీ అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తుల వాట్సాప్ లో ఈ ఇద్దరు హీరోయిన్ లతో చేసిన చాటింగ్ క్లియర్ గా ఉందట. అలాగే కోడ్ భాష ఎక్కువగా ఉందట. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడినట్లే అని అంటున్నారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వస్తుందా ? లేక టాలీవుడ్ కేసు లాగే సైలెంట్ అయిపోతోందా అన్నది చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి