రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ లీడర్

0
80
political leader revanth reddy

రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ లీడర్

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు టీఆర్ఎస్ లీడర్ స్వామి గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనమండలికి మొట్టమొదటి చైర్మన్ గా వ్యవహరించిన స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే శాసనమండలి చైర్మన్ గా పదవీకాలం పూర్తయ్యాక స్వామి గౌడ్ కు తగిన ప్రాధాన్యత లభించలేదు. దాంతో కొంతకాలంగా గులాబీ అధినేత పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నాడు స్వామి గౌడ్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి తో పాటుగా స్వామి గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఆ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు స్వామి గౌడ్. రేవంత్ రెడ్డి అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ లకు వెన్నుదన్నుగా నిలిచాడని , అందుకే అణగారిన బీసీ లు రేవంత్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అధికారం కేవలం కొంతమంది అగ్ర కులాల చేతిలో బందీ అయ్యిందని , ఒక పారీ నుండి 2500 కోట్లు ఉన్న వ్యక్తిని నిలబెడుతుంటే మరో పార్టీ 3500 కోట్లున్న వ్యక్తిని బరిలోకి దించాలని చూస్తోందని దుయ్యబట్టారు స్వామి గౌడ్.

ఇక రేవంత్ రెడ్డి కూడా స్వామి గౌడ్ పై ప్రశంసలు కురిపించాడు. ఉద్యమ సమయంలో స్వామి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ ల పోరాటం మరువలేనిదని కొనియాడారు. కేసీఆర్ అండ్ కో అంటే ఉవ్వెత్తున లేచే రేవంత్ రెడ్డి తో స్వామి గౌడ్ కలిసాడంటే అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందన్న మాట. అది ఎప్పుడో బద్దలై దావనాలంలా మారడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మునుపటి వ్యాసంమహబూబ్ నగర్ అడవుల్లో అల్లు అర్జున్
తదుపరి ఆర్టికల్శుభవార్త: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి