చిరంజీవికి షాక్ ఇచ్చిన త్రిష

0
27
trisha krishnan walk out to acharya movie

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య చిత్రం నుండి తప్పుకుని చిరంజీవికి షాక్ ఇచ్చింది హీరోయిన్ త్రిష. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి సరసన చిత్రంలో త్రిష ని ఎంపిక చేసారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు త్రిష కు చెప్పిన విధానం వేరట ! అయితే షూటింగ్ కు వచ్చాకా చేస్తున్న సన్నివేశాలు వేరు కావడంతో నాకు చెప్పిన విధంగా తీయకపోవడంతో సినిమా నుండి తప్పుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది త్రిష.

ఇప్పటికే త్రిష పై కొని సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకులు కొరటాల శివ. తనకు చెప్పిన సీన్స్ వేరు షూటింగ్ లో చేస్తున్న సీన్స్ వేరు కావడంతో తప్పకుంది. త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరొకరిని ఎంపిక చేసే పనిలో పడ్డారట. 2006 లో చిరంజీవిత్రిష జంటగా స్టాలిన్ అనే చిత్రం వచ్చింది. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు అనుకుంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల త్రిష తప్పుకోవడం సంచలనంగా మారింది

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి