విషాదం : పవన్ కల్యాణ్ అభిమానులు మృతి

0
43
pawan sad thing happend

ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తమ అభిమాన హీరోకు భారీ ఎత్తున కటౌట్ కట్టాలని చేసే ప్రయత్నంలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు విద్యుత్ షాక్ తో మరణించగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న సీతాపురం గ్రామంలో జరిగింది. 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా పై నున్న విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పవన్ కల్యాణ్ ని తీవ్రంగా కలిచివేసింది. దాంతో చనిపోయిన ముగ్గురు అభిమానులకు తలా 2 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు పవన్ అలాగే ఆ కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపాడు పవన్.

వరంగల్ దగ్గర మరో అయిదుగురు అభిమానుల మృతి

పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ములుగు సమీప ప్రాంతంలో జరుపుకోవాలని భావించిన అయిదుగురు అభిమానులు స్విఫ్ట్ కారులో వరంగల్ పోచమ్మ మైదానం కు చెందిన వాళ్ళు బయలుదేరారు. దామెర – పసరగొండ దగ్గర పవన్ అభిమానులు ప్రయాణిస్తున్న కారుని ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే అయిదుగురు అభిమానులు చనిపోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ములుగు పరిసర ప్రాంతాలలో ఎక్కువగా టూరిజం స్పాట్స్ ఉన్నాయి దాంతో అక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

ఒకే రోజున పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆశించిన అభిమానులు 8 మంది చనిపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 8 మంది కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఇక ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో పవన్ నటిస్తున్న మూడు సినిమాల విశేషాలను వెల్లడించనున్నారు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు.

మునుపటి వ్యాసంసైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న నటి
తదుపరి ఆర్టికల్పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండగే పండగ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి