మహేష్ అభిమాని మృతి :మహేష్ బాబు తీవ్ర ఆవేదన

0
47
mahesh babu with suresh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని దరిశి సురేష్ బాబు మరణించాడు దాంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నెల్లూరుకి చెందిన దరిశి సురేష్ బాబు మహేష్ బాబు అభిమాన సంఘం కు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నుండి మహేష్ బాబు వరకు దరిశి సురేష్ బాబు అభిమానిగా కొనసాగుతూనే ఉన్నాడు. మహేష్ బాబు చిన్నప్పటి నుండే హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుండే సురేష్ బాబు మహేష్ బాబుకు బాగా పరిచయం. దాదాపు మూడు దశాబ్దాలుగా అభిమానిగా కొనసాగుతున్నాడు సురేష్ బాబు.

అయితే అంతటి వీరాభిమాని సడెన్ గా చనిపోవడంతో మహేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు దాంతో అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేసాడు మహేష్ బాబు. సురేష్ బాబు తనతో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేసాడు మహేష్ బాబు. దాంతో మహేష్ బాబు అభిమానుల్లో విషాదం నెలకొంది. సురేష్ బాబు కుటుంబానికి అండగా ఉంటానని కూడా ట్వీట్ చేసాడు మహేష్ బాబు. తన అభిమానులు మరణించిన సమయాల్లో సదరు హీరోలు ఆ అభిమాని కుటుంబాలకు ఆర్ధిక సహాయం కూడా అందిస్తున్నారు. అలాగే మహేష్ బాబు కూడా ఆర్ధిక సహాయం అందిస్తానని మాట ఇచ్చాడు.

మహేష్ బాబు ఇటీవలే ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక త్వరలోనే సర్కారు వారి పాట చిత్రంలో పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ల వద్ద లోన్ లు తీసుకొని ఆ లోన్ డబ్బులు కట్టకుండా మోసం చేస్తున్న వాళ్ళ అటకట్టించే పాత్రలో మహేష్ బాబు అభినయం అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి