బిజినెస్ రంగంలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు

0
33
heros whi havind business

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న పలువురు హీరోలు బిజినెస్ రంగంలో కూడా ఓ వెలుగు వెలుగుతున్నారు అలాగే రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. ఒకవైపు స్టార్ డం అనుభవిస్తూనే మరోవైపు తమ దగ్గర ఉన్న కోట్ల కొద్దీ డబ్బుని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూ డబ్బు గడిస్తున్నారు అలాగే వ్యాపారంలో కూడా విజయం సాధించి బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వాళ్ళు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దామా !

మెగాస్టార్ చిరంజీవి : టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలుగా చెలామణి అవుతున్న చిరు మా టివిలో పెట్టుబడులు పెట్టారు , ఆ తర్వాత భారీ లాభాలకు కొంత వాటా అమ్మేసి సచిన్ టెండూల్కర్ తో కలిసి కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే క్రీడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. అలాగే సొంత చిత్ర నిర్మాణం కూడా చేస్తున్నాడు.

నాగార్జున : కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూనే సొంత చిత్ర నిర్మాణం చేస్తున్నాడు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలతో బిజీగా ఉంటున్నాడు అంతేనా పలు యాడ్ లలో నటిస్తూ అలా కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. యాంకర్ గా కూడా చేస్తున్నాడు. మా టివిలో పెట్టుబడులు పెట్టి భారీ మొత్తానికి వాటా అమ్ముకొని సచిన్ టెండూల్కర్ , చిరంజీవి లతో కలిసి కేరళ బ్లాస్టర్స్ క్రీడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నాడు అంతేనా ఎన్ కన్వెన్షన్ సెంటర్ , ఎన్ గ్రిల్ రెస్టారెంట్ ని కూడా నడిపిస్తున్నాడు.

మోహన్ బాబు : హీరోగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంచలనం సృష్టించిన మోహన్ బాబు సొంత చిత్ర నిర్మాణం కూడా చేపట్టి భారీగానే లాభాలు గడించాడు. అలాగే విద్యానికేతన్ అనే పేరుతో విద్యాసంస్థలు ప్రారంభించి విజయం సాధించాడు.

మహేష్ బాబు : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటిస్తూనే మల్టీప్లెక్స్ రంగంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏ ఎం బి  మాల్ లో 7 స్క్రీన్ ల మల్టీప్లెక్స్ ఏషియన్ నారంగ్ తో కలిసి నెలకొల్పాడు. అలాగే యాడ్స్ రంగంలో రారాజుగా ఉన్నాడు మహేష్. అత్యధికంగా ఎక్కువ యాడ్స్ లో నటిస్తున్న హీరో కేవలం మహేష్ బాబు మాత్రమే.

రాంచరణ్ : హీరోగా నటిస్తూ సొంత చిత్ర నిర్మాణం కూడా చేపట్టిన రాంచరణ్ పోల్ అండ్ రైడింగ్ క్లబ్ కు యజమాని. టర్బో మెగా ఎయిర్ వేస్ లిమిటెడ్ ని దిగ్విజయంగా రన్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ : ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన రేంజ్ పెంచుకోవడానికి ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యేలా చేసుకుంటున్న అల్లు అర్జున్ అంతర్జాతీయ కంపెనీ అయిన ఎం కిచెన్ తో టై అప్ అయ్యాడు . చాలా పేరెన్నికగన్న ఈ రెస్టారెంట్ తో బాగానే లాభాలు గడిస్తున్నాడు అల్లు అర్జున్.

విజయ్ దేవరకొండ : టాలీవుడ్ లో సర్రున దూసుకొచ్చిన ఈ రౌడీ హీరో తన బ్రాండ్ ని మరింతగా పెంచుకునేలా అలాగే యువతలో తనకున్న క్రేజ్ తో రౌడీ వేర్ సంస్థని నెలకొల్పి సరికొత్త బ్రాండ్ తో దూసుకుపోతున్నాడు. ఊహించని క్రేజ్ రావడంతో దాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. 

మునుపటి వ్యాసంఎం ఎల్ ఏ  ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది
తదుపరి ఆర్టికల్ఆ పాత్రలో తమన్నానా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి