టాలీవుడ్  సింగర్ తల్లి మృతి

0
72
singer karunya

టాలీవుడ్  సింగర్ తల్లి మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు కారుణ్య తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కారుణ్య తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న హైదరాబాద్ పరిసర ప్రాంతమైన మీర్ పేటలో మరణించింది. తల్లి మరణంతో కారుణ్య కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కారుణ్య తల్లి జానకి కేంద్ర రక్షణ సంస్థ అయిన బిడీఎల్ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు. చాలరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతోంది జానకమ్మ. చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు సరికదా మరింతగా క్షీణించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు.

తల్లి మరణంతో కన్నీళ్ల పర్యంతం అయిన కారుణ్య ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తల్లి అంత్యక్రియలను కేవలం కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు ఎందుకంటే కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి. కారుణ్య సోనీ టీవీ నిర్వహించిన మ్యూజిక్ షోలో విన్నర్ గా గెలిచాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో పాటలు పాడాడు. కారుణ్య పాడిన పాటలు కొన్ని బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. కారుణ్య తల్లి మరణించిందన్న వార్త టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. కారుణ్య తల్లి మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కారుణ్య కు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి