టాలీవుడ్ లో మరో విషాదం: రావి కొండలరావు మృతి

0
47

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రావి కొండలరావు (88) మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రావి కొండలరావు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. 1932 ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. సినిమాలపై మక్కువతో మద్రాస్ వెళ్ళాడు. 1958 లో శోభ చిత్రంతో రావి కొండలరావు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. సుదీర్ఘ నట ప్రస్తానంలో దాదాపు 600 సినిమాల్లో నటించాడు.

రావి కొండలరావు నటుడు మాత్రమే కాదు రచయిత కూడా. తెలుగులో వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ , మాటలు అందించారు. నటుడిగా, రచయిత గా చెరగని ముద్ర వేసిన రావి కొండలరావు హృద్రోగంతో బాధపడుతున్నారు. కరోనా సమయంలో మరింత దిగులుపడ్డారు. సీనియర్ నటుడు రావి కొండలరావు ఇక లేరు అని క్షణాల్లో టాలీవుడ్ లో తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమకు రావి కొండలరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి