కరోనాతో టాలీవుడ్ హీరో తండ్రి మృతి

0
16

 

టాలీవుడ్ హీరో ఈరోజుల్లో ఫేమ్ శ్రీ తండ్రి మంగం వెంకట కృష్ణ రాంప్రసాద్ కరోనాతో మరణించాడు. గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మంగం వెంకట కృష్ణ రాంప్రసాద్. అయితే నిన్న రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో మరణించాడు. తండ్రి మరణంతో హీరో శ్రీ తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. కోవిడ్ తో మరణించడంతో శ్రీ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్ చేయనున్నారు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈరోజుల్లో. అప్పట్లో 5 డి లో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈరోజుల్లో సినిమాలో శ్రీ హీరోగా నటించాడు. ఈరోజుల్లో పెద్ద హిట్ కావడంతో మారుతి కి మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే శ్రీ మాత్రం హీరోగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఈరోజుల్లో తర్వాత దాదాపు అరడజను చిత్రాల్లో నటించాడు శ్రీ కానీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాడు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీ కి తండ్రి మరణం అందునా కోవిడ్ తో మరణించడం అన్నది జీర్ణించుకోలేక పోతున్నాడట. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరాళ నృత్యం చేస్తోంది కరోనా.

మునుపటి వ్యాసంఅల్లు అర్జున్ రెమ్యునరేషన్ 30 కోట్లా ?
తదుపరి ఆర్టికల్మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి